Sri Shambhu Deva Prarthana – శ్రీ శంభుదేవ ప్రార్థన

Shiva stotram, Stotram Nov 02, 2024

జయ ఫాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా |
జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో || ౧ ||

జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణా |
జయ యోగమార్గ జితరాగదుర్గ మునియాగభాగ భర్గా || ౨ ||

జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గసర్గ కల్పా |
జయ బంధుజీవ సుమబంధుజీవ సమసాంధ్య రాగ జూటా || ౩ ||

జయ చండచండతర తాండవోగ్రభర కంపమాన భువనా |
జయ హార హీర ఘనసార సారతర శారదాభ్రరూపా || ౪ ||

జయ శృంగి శృంగి శ్రుతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతీ |
జయ కాలకంఠ కలకంఠకంఠ సురసుందరీస్తుత శ్రీ || ౫ ||

జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ |
జయ దగ్ధభావ భవ స్నిగ్ధభావ భవ ముగ్ధభావ భవనా || ౬ ||

జయ రుండమాలి జయ రూక్షవీక్ష రుచిరుంద్రరూప రుద్రా |
జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవా || ౭ ||

జయ ఘోర ఘోరతరతాపజాప తప ఉగ్రరూప విజితా |
జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలీ || ౮ ||

జయ సూర్యచంద్రశిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్రా |
జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రి యుగ్మా || ౯ ||

జయ ఫాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూష శూలీ |
జయ కాలకాల జయ మృత్యుమృత్యు జయ దేవదేవ శంభో || ౧౦ ||

శ్రీ లలితా ఆవిర్భావ స్తుతి >>

మరిన్ని శ్రీ శివ స్తోత్రములు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *