(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.) పూజా విధానం (పూర్వాంగం) చూ. || శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. || పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ లలితా పరమేశ్వరీముద్దిశ్య శ్రీ లలితాపరమేశ్వరీ ప్రీత్యర్థం యవచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పీఠపూజ – ఆధారశక్త్యై నమః | వరాహాయ నమః | దిగ్గజేభ్యో నమః | పత్రేభ్యో నమః | కేసరేభ్యో నమః |…