Sadashiva Ashtakam – సదాశివాష్టకమ్in Telugu

Shiva stotram, Stotram Nov 02, 2024

పతంజలిరువాచ-
సువర్ణపద్మినీతటాంతదివ్యహర్మ్యవాసినే
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే |
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౧ ||

సతుంగ భంగ జహ్నుజా సుధాంశు ఖండ మౌళయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే |
భుజంగరాజమండలాయ పుణ్యశాలిబంధవే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౨ ||

చతుర్ముఖాననారవిందవేదగీతభూతయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే |
చతుర్విధార్థదానశౌండ తాండవస్వరూపిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౩ ||

శరన్నిశాకర ప్రకాశ మందహాస మంజులా-
ధరప్రవాళ భాసమాన వక్త్రమండల శ్రియే |
కరస్ఫురత్కపాలముక్తరక్తవిష్ణుపాలినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౪ ||

సహస్ర పుండరీక పూజనైక శూన్యదర్శనా-
త్సహస్రనేత్ర కల్పితార్చనాచ్యుతాయ భక్తితః |
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౫ ||

రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్ర చాపశింజినీకృతానిలాశినే |
స్వసారథీకృతాజనున్నవేదరూపవాజినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౬ ||

అతి ప్రగల్భ వీరభద్రసింహనాద గర్జిత
శ్రుతిప్రభీత దక్షయాగ భోగినాక సద్మనామ్ |
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౭ ||

మృకండుసూను రక్షణావధూతదండపాణయే
సుగంధమండల స్ఫురత్ప్రభాజితామృతాంశవే |
అఖండభోగసంపదర్థలోకభావితాత్మనే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే || ౮ ||

మధురిపువిధి శక్ర ముఖ్యదేవైరపి నియమార్చితపాదపంకజాయ |
కనకగిరిశరాసనాయ తుభ్యం రజత సభాపతయే నమశ్శివాయ || ౯ ||

హాలాస్యనాథాయ మహేశ్వరాయ హాలాహలాలంకృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ నమో నమస్సుందరతాండవాయ || ౧౦ ||

ఇతి శ్రీ హాలాస్యమాహాత్మ్యే పతంజలికృత సదాశివాష్టకమ్ |

మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *