Tag

shivapadana

Sri Shiva Gadyam (Shivapadana Dandaka Stotram) – శ్రీ శివ గద్యం (శ్రీ శివాపదాన దండక స్తోత్రం)

Shiva stotram, Stotram Jun 19, 2023

శైలాదికృతనిషేవణ కైలాసశిఖరభూషణ తత్వార్థగోచర చంద్రార్ధశేఖర పాశాయుధకులార్థ్యస్మితాపాంగ కోపారుణకటాక్ష భస్మితానంగ సస్మితాపాంగ ఊరీకృతవిభూతి దివ్యాంగరాగ గౌరీపరిగృహీతసవ్యాంగభాగ అంగానుషంగ పావితనరాస్థిదేశ గంగాతరంగభాసితజటాప్రదేశ వందనాభిరతాఖండల స్యందనాయితభూమండల ఆశ్రితదాసతాపసకదంబ చక్రీకృతార్కశీతకరబింబ ఆదృతపురాణవేతండ స్వీకృతసుమేరుకోదండ ఖర్వీకృతాసురమదానుపూర్వీవికాస-దర్వీకరేశ్వర గృహీతమౌర్వీవిలాస-వీణామునీంద్రఖ్యాపిత గరిమ పౌరుష బాణాధికార స్థాపితపరమపూరుష అనిలాశనవిహితనైపథ్య కమలాసనవిహితసారథ్య విశ్వాధికత్వపరికలితోపలంభ అశ్వాయితాద్యవచోగుంభ కుందస్మయహర కాంతిప్రకర మందస్మితలవ శాంతత్రిపుర నాదబిందుకళాభిజ్ఞాస్పద భూరిభద్ర స్వేదబిందులవావిర్భావిత వీరభద్రత్రస్తరక్షా పరతంత్రధ్వస్తదక్షాధ్వరతంత్ర కిరీటనీతవివిధవేధఃకపాల చపేటాఘాత శిథిలభాస్వత్కపోల విజృంభితవిక్రమోద్దండ స్తంభితచక్రిదోర్దంద బ్రహ్మస్తవోచితమహాహర్ష జిహ్వస్వభావ జనదురాధర్ష వసుంధరాధరసుతోపలాలన జరందరాసురశిరోనిపాతన కోపాహతపతితాంతక వ్యాపాదితసమదాంధక పరసంహననజటాసంభృతపరభాగగౌర నరసింహనియమనాలంబితశరభావతార ప్రసన్న భయమోచన విభిన్నభగలోచన ప్రపంచదహనకారక విరించివదనహారక సంచారపూతమందర పంచాయుధాతిసుందర…