ధ్యానం | భుజైశ్చతుర్భిర్వరదాభయాసి- గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ | పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం సింహే నిషణ్ణం బుధమాశ్రయామి || పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః | పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః || ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః | నాథో మగధదేశస్య మంత్ర మంత్రార్థ తత్త్వవిత్ || సుఖాసనః కర్ణికారో జైత్త్రశ్చాత్రేయ గోత్రవాన్ | భరద్వాజఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః || అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే | ప్రవిష్టస్సూక్ష్మరూపేణ సమస్తవరదస్సుఖీ || సదా ప్రదక్షిణం మేరోః కుర్వాణః కామరూపవాన్ | అసిదండౌ చ బిభ్రాణః సంప్రాప్తసుఫలప్రదః || కన్యాయా…