Tag

సుబ్రహ్మణ్యాష్టకం

Sri Subrahmanya Ashtakam (Karavalamba Stotram) – శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం

హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో |శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ || అర్థం – హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము. దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ || అర్థం – దేవాదిదేవునిచే (శివుడిచే) ప్రశంసింపబడువాడా, దేవగణములకు అధిపతీ, దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన…