Tag

వీరభద్ర

Sri Veerabhadra Dandakam – శ్రీ వీరభద్ర దండకం

Shiva stotram, Stotram Nov 02, 2024

  శ్రీమన్ మహావీరభద్రా సుమౌనీంద్ర భద్రపణ సర్వసిద్ధిప్రదా భద్రకాళీమనఃపద్మసంచార భాగ్యోదయా నిత్యసత్యప్రియా సచ్చిదానందరూపా విరూపాక్ష దక్షధ్వరధ్వంసకా దేవ నీ దైవతత్త్వంబులన్ బొగడ బ్రహ్మాదులే చాలరన్నన్ మనో బుద్ధి చాంచల్యమున్ జేసి వర్ణింపగా బూనితిన్ రుద్రుడిన్నింద్రదంష్ట్రోష్టుడై క్రోధతామ్రాక్షుడై అంగ దుర్దంగ పింగ జటాజూట సందోహమందొక్క దివ్యజ్జటన్ తీసి శ్యామండలిన్ వైవ భూమ్యాన్తరిక్షంబులన్ ప్రజ్వల్లతాపాక జ్వాలలన్ జిమ్ము కేశాలితో చండ వేదాండ శుండావ డొర్దండ హేతి ప్రకాండంబుతో విస్ఫులింగద్యుతిన్ వెల్గు నేత్రత్రయీయుక్త నాభిలక్-దంష్ట్రోగ్ర వక్త్రంబుతో వీరభద్రుండవై బుట్టి దక్షధ్వరధ్వంసమున్ జేయు నీ తండ్రి యాజ్ఞన్ తలందాల్చి భూత…