ఓం అస్య శ్రీ లక్ష్మీనృసింహ దివ్య సహస్రనామస్తోత్రమహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛందః శ్రీలక్ష్మీనృసింహ దేవతా క్ష్రౌం ఇతి బీజం శ్రీం ఇతి శక్తిః నఖదంష్ట్రాయుధాయేతి కీలకం మన్త్రరాజ శ్రీలక్ష్మీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం
యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్జ్వలమ్ |
త్ర్యక్షం చక్రపినాకసాభయకరాన్బిభ్రాణమర్కచ్ఛవిం
ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే || ౧
లక్ష్మీ చారుకుచద్వన్ద్వకుంకుమాంకితవక్షసే |
నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే || ౨
ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంతగోచరమ్ |
భూయోల్లాసితసంసారచ్ఛేదహేతుం జగద్గురుమ్ || ౩
బ్రహ్మోవాచ |
ఓం నమో నారసింహాయ వజ్రదంష్ట్రాయ వజ్రిణే |
వజ్రదేహాయ వజ్రాయ నమో వజ్రనఖాయ చ || ౧ ||
వాసుదేవాయ వన్ద్యాయ వరదాయ వరాత్మనే |
వరదాభయహస్తాయ వరాయ వరరూపిణే || ౨ ||
వరేణ్యాయ వరిష్ఠాయ శ్రీవరాయ నమో నమః |
ప్రహ్లాదవరదాయైవ ప్రత్యక్షవరదాయ చ || ౩ ||
పరాత్పరాయ పారాయ పవిత్రాయ పినాకినే |
పావనాయ ప్రసన్నాయ పాశినే పాపహారిణే || ౪ ||
పురుష్టుతాయ పుణ్యాయ పురుహూతాయ తే నమః |
తత్పూరుషాయ తథ్యాయ పురాణపురుషాయ చ || ౫ ||
పురోధసే పూర్వజాయ పుష్కరాక్షాయ తే నమః |
పుష్పహాసాయ హాసాయ మహాహాసాయ శార్ఙ్గిణే || ౬ ||
సింహరాజాయ సింహాయ జగద్వన్ద్యాయ తే నమః |
అట్టహాసాయ రోషాయ జ్వాలాహాసాయ తే నమః || ౭ ||
భూతావాసాయ వాసాయ శ్రీనివాసాయ ఖడ్గినే |
ఖడ్గజిహ్వాయ సింహాయ ఖడ్గవాసాయ తే నమః || ౮ ||
నమో మూలాధివాసాయ ధర్మవాసాయ ధర్మిణే |
ధనంజయాయ ధన్యాయ నమో మృత్యుంజయాయ చ || ౯ ||
శుభంజయాయ సూత్రాయ నమః శత్రుంజయాయ చ |
నిరంజనాయ నీరాయ నిర్గుణాయ గుణాత్మనే || ౧౦ ||
నిష్ప్రపంచాయ నిర్వాణప్రదాయ నిబిడాయ చ |
నిరాలంబాయ నీలాయ నిష్కళాయ కళాత్మనే || ౧౧ ||
నిమేషాయ నిబంధాయ నిమేషగమనాయ చ | [** నిబద్ధాయ **]
నిర్ద్వంద్వాయ నిరాశాయ నిశ్చయాయ నిజాయ చ || ౧౨ ||
నిర్మలాయ నిదానాయ నిర్మోహాయ నిరాకృతే |
నమో నిత్యాయ సత్యాయ సత్కర్మనిరతాయ చ || ౧౩ ||
సత్యధ్వజాయ ముంజాయ ముంజకేశాయ కేశినే |
హరికేశాయ కేశాయ గుడాకేశాయ వై నమః || ౧౪ ||
సుకేశాయోర్ధ్వకేశాయ కేశిసంహారకాయ చ |
జలేశాయ స్థలేశాయ పద్మేశాయోగ్రరూపిణే || ౧౫ ||
పుష్పేశాయ కులేశాయ కేశవాయ నమో నమః |
సూక్తికర్ణాయ సూక్తాయ రక్తజిహ్వాయ రాగిణే || ౧౬ ||
దీప్తరూపాయ దీప్తాయ ప్రదీప్తాయ ప్రలోభినే |
ప్రసన్నాయ ప్రబోధాయ ప్రభవే విభవే నమః || ౧౭ ||
ప్రభంజనాయ పాంథాయ ప్రమాయప్రతిమాయ చ |
ప్రకాశాయ ప్రతాపాయ ప్రజ్వలాయోజ్జ్వలాయ చ || ౧౮ ||
జ్వాలామాలాస్వరూపాయ జ్వాలజిహ్వాయ జ్వాలినే |
మహాజ్వాలాయ కాలాయ కాలమూర్తిధరాయ చ || ౧౯ ||
కాలాంతకాయ కల్పాయ కలనాయ కలాయ చ |
కాలచక్రాయ చక్రాయ షట్చక్రాయ చ చక్రిణే || ౨౦ ||
అక్రూరాయ కృతాంతాయ విక్రమాయ క్రమాయ చ |
కృత్తినే కృత్తివాసాయ కృతఘ్నాయ కృతాత్మనే || ౨౧ ||
సంక్రమాయ చ క్రుద్ధాయ క్రాంతలోకత్రయాయ చ |
అరూపాయ సరూపాయ హరయే పరమాత్మనే || ౨౨ ||
అజయాయాదిదేవాయ హ్యక్షయాయ క్షయాయ చ |
అఘోరాయ సుఘోరాయ ఘోరఘోరతరాయ చ || ౨౩ ||
నమోఽస్తు ఘోరవీర్యాయ లసద్ఘోరాయ తే నమః |
ఘోరాధ్యక్షాయ దక్షాయ దక్షిణార్హాయ శంభవే || ౨౪ ||
అమోఘాయ గుణౌఘాయ హ్యనఘాయాఘహారిణే |
మేఘనాదాయ నాదాయ తుభ్యం మేఘాత్మనే నమః || ౨౫ || [** నాథాయ **]
మేఘవాహనరూపాయ మేఘశ్యామాయ మాలినే |
వ్యాలయజ్ఞోపవీతాయ వ్యాఘ్రదేహాయ తే నమః || ౨౬ ||
వ్యాఘ్రపాదాయ తే వ్యాఘ్రకర్మణే వ్యాపకాయ చ |
వికటాస్యాయ వీర్యాయ విష్టరశ్రవసే నమః || ౨౭ ||
వికీర్ణనఖదంష్ట్రాయ నఖదంష్ట్రాయుధాయ చ |
విశ్వక్సేనాయ సేనాయ విహ్వలాయ బలాయ చ || ౨౮ ||
విరూపాక్షాయ వీరాయ విశేషాక్షాయ సాక్షిణే |
వీతశోకాయ విత్తాయ విస్తీర్ణవదనాయ చ || ౨౯ ||
విధానాయ విధేయాయ విజయాయ జయాయ చ |
విబుధాయ విభావాయ నమో విశ్వంభరాయ చ || ౩౦ ||
వీతరాగాయ విప్రాయ విటంకనయనాయ చ |
విపులాయ వినీతాయ విశ్వయోనే నమో నమః || ౩౧ ||
విడంబనాయ విత్తాయ విశ్రుతాయ వియోనయే |
విహ్వలాయ వివాదాయ నమో వ్యాహృతయే నమః || ౩౨ ||
విరాసాయ వికల్పాయ మహాకల్పాయ తే నమః |
బహుకల్పాయ కల్పాయ కల్పాతీతాయ శిల్పినే || ౩౩ ||
కల్పనాయ స్వరూపాయ ఫణితల్పాయ వై నమః |
తటిత్ప్రభాయ తార్క్ష్యాయ తరుణాయ తరస్వినే || ౩౪ ||
రసనాయాన్తరిక్షాయ తాపత్రయహరాయ చ |
తారకాయ తమోఘ్నాయ తత్త్వాయ చ తపస్వినే || ౩౫ ||
తక్షకాయ తనుత్రాయ తటితే తరలాయ చ |
శతరూపాయ శాంతాయ శతధారాయ తే నమః || ౩౬ ||
No Comments