లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ || హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || ౨ || పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || ౩ || శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || ౪ || నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || ౫ || కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయినిగా…