Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

నారాయణీయం దశక 65 – గోపికానాం భగవత్సామీప్యప్రాప్తిః

Narayaniyam Dashaka 65 in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

narayaniyam dashaka 65 in telugu

గోపీజనాయ కథితం నియమావసానే
మారోత్సవం త్వమథ సాధయితుం ప్రవృత్తః ।
సాంద్రేణ చాంద్రమహసా శిశిరీకృతాశే
ప్రాపూరయో మురలికాం యమునావనాంతే ॥1॥

సమ్మూర్ఛనాభిరుదితస్వరమండలాభిః
సమ్మూర్ఛయంతమఖిలం భువనాంతరాలమ్ ।
త్వద్వేణునాదముపకర్ణ్య విభో తరుణ్య-
స్తత్తాదృశం కమపి చిత్తవిమోహమాపుః ॥2॥

తా గేహకృత్యనిరతాస్తనయప్రసక్తాః
కాంతోపసేవనపరాశ్చ సరోరుహాక్ష్యః ।
సర్వం విసృజ్య మురలీరవమోహితాస్తే
కాంతారదేశమయి కాంతతనో సమేతాః ॥3॥

కాశ్చిన్నిజాంగపరిభూషణమాదధానా
వేణుప్రణాదముపకర్ణ్య కృతార్ధభూషాః ।
త్వామాగతా నను తథైవ విభూషితాభ్య-
స్తా ఏవ సంరురుచిరే తవ లోచనాయ ॥4॥

హారం నితంబభువి కాచన ధారయంతీ
కాంచీం చ కంఠభువి దేవ సమాగతా త్వామ్ ।
హారిత్వమాత్మజఘనస్య ముకుంద తుభ్యం
వ్యక్తం బభాష ఇవ ముగ్ధముఖీ విశేషాత్ ॥5॥

కాచిత్ కుచే పునరసజ్జితకంచులీకా
వ్యామోహతః పరవధూభిరలక్ష్యమాణా ।
త్వామాయయౌ నిరుపమప్రణయాతిభార-
రాజ్యాభిషేకవిధయే కలశీధరేవ ॥6॥

కాశ్చిత్ గృహాత్ కిల నిరేతుమపారయంత్య-
స్త్వామేవ దేవ హృదయే సుదృఢం విభావ్య ।
దేహం విధూయ పరచిత్సుఖరూపమేకం
త్వామావిశన్ పరమిమా నను ధన్యధన్యాః ॥7॥

జారాత్మనా న పరమాత్మతయా స్మరంత్యో
నార్యో గతాః పరమహంసగతిం క్షణేన ।
తం త్వాం ప్రకాశపరమాత్మతనుం కథంచి-
చ్చిత్తే వహన్నమృతమశ్రమమశ్నువీయ ॥8॥

అభ్యాగతాభిరభితో వ్రజసుందరీభి-
ర్ముగ్ధస్మితార్ద్రవదనః కరుణావలోకీ ।
నిస్సీమకాంతిజలధిస్త్వమవేక్ష్యమాణో
విశ్వైకహృద్య హర మే పవనేశ రోగాన్ ॥9॥

narayaniyam dashaka 65 in telugu

Copy
Give Feedback