Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

నారాయణీయం దశక 95 – ధ్యానయోగః – మోక్షప్రాప్తిమార్గః

Narayaniyam Dashaka 95 in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

narayaniyam dashaka 95 in telugu

ఆదౌ హైరణ్యగర్భీం తనుమవికలజీవాత్మికామాస్థితస్త్వం
జీవత్వం ప్రాప్య మాయాగుణగణఖచితో వర్తసే విశ్వయోనే ।
తత్రోద్వృద్ధేన సత్త్వేన తు గుణయుగలం భక్తిభావం గతేన
ఛిత్వా సత్త్వం చ హిత్వా పునరనుపహితో వర్తితాహే త్వమేవ ॥1॥

సత్త్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేఽపి భూమన్
భూయోఽప్యేషు ప్రవృత్తిస్సతమసి రజసి ప్రోద్ధతే దుర్నివారా ।
చిత్తం తావద్గుణాశ్చ గ్రథితమిహ మిథస్తాని సర్వాణి రోద్ధుం
తుర్యే త్వయ్యేకభక్తిశ్శరణమితి భవాన్ హంసరూపీ న్యగాదీత్ ॥2॥

సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని
క్షుద్రానందాశ్చ సాంతా బహువిధగతయః కృష్ణ తేభ్యో భవేయుః ।
త్వం చాచఖ్యాథ సఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం
త్వద్భక్త్యానందతుల్యః ఖలు విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్ ॥3॥

త్వత్భక్త్యా తుష్టబుద్ధేః సుఖమిహ చరతో విచ్యుతాశస్య చాశాః
సర్వాః స్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరగస్యేవ తోయైకమయ్యః ।
సోఽయం ఖల్వింద్రలోకం కమలజభవనం యోగసిద్ధీశ్చ హృద్యాః
నాకాంక్షత్యేతదాస్తాం స్వయమనుపతితే మోక్షసౌఖ్యేఽప్యనీహః ॥4॥

త్వద్భక్తో బాధ్యమానోఽపి చ విషయరసైరింద్రియాశాంతిహేతో-
ర్భక్త్యైవాక్రమ్యమాణైః పునరపి ఖలు తైర్దుర్బలైర్నాభిజయ్యః ।
సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారుప్రపంచం
త్వద్భక్త్యోఘే తథైవ ప్రదహతి దురితం దుర్మదః క్వేంద్రియాణామ్ ॥5॥

చిత్తార్ద్రీభావముచ్చైర్వపుషి చ పులకం హర్షవాష్పం చ హిత్వా
చిత్తం శుద్ధ్యేత్కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః ।
త్వద్గాథాస్వాదసిద్ధాంజనసతతమరీమృజ్యమానోఽయమాత్మా
చక్షుర్వత్తత్త్వసూక్ష్మం భజతి న తు తథాఽభ్యస్తయా తర్కకోట్యా॥6॥

ధ్యానం తే శీలయేయం సమతనుసుఖబద్ధాసనో నాసికాగ్ర-
న్యస్తాక్షః పూరకాద్యైర్జితపవనపథశ్చిత్తపద్మం త్వవాంచం।
ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖినః సంవిచింత్యోపరిష్టాత్
తత్రస్థం భావయే త్వాం సజలజలధరశ్యామలం కోమలాంగమ్ ॥7॥

ఆనీలశ్లక్ష్ణకేశం జ్వలితమకరసత్కుండలం మందహాస-
స్యందార్ద్రం కౌస్తుభశ్రీపరిగతవనమాలోరుహారాభిరామమ్ ।
శ్రీవత్సాంకం సుబాహుం మృదులసదుదరం కాంచనచ్ఛాయచేలం
చారుస్నిగ్ధోరుమంభోరుహలలితపదం భావయేఽహం భవంతమ్ ॥8॥

సర్వాంగేష్వంగ రంగత్కుతుకమితి ముహుర్ధారయన్నీశ చిత్తం
తత్రాప్యేకత్ర యుంజే వదనసరసిజే సుందరే మందహాసే
తత్రాలీనం తు చేతః పరమసుఖచిదద్వైతరూపే వితన్వ-
న్నన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢయోగో భవేయమ్ ॥9॥

ఇత్థం త్వద్ధ్యానయోగే సతి పునరణిమాద్యష్టసంసిద్ధయస్తాః
దూరశ్రుత్యాదయోఽపి హ్యహమహమికయా సంపతేయుర్మురారే ।
త్వత్సంప్రాప్తౌ విలంబావహమఖిలమిదం నాద్రియే కామయేఽహం
త్వామేవానందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వతాపాత్ ॥10॥

narayaniyam dashaka 95 in telugu

Copy
Give Feedback