Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

రామచంద్రాయ జనక (మంగళం)

Ramachandraya Janaka Mangalam in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

ramachandraya janaka mangalam in telugu

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥

కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥

చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥

లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మంగళమ్ ॥ 3 ॥

దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళమ్ ॥ 4 ॥

పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతుల మంగళమ్ ॥ 5 ॥

విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళమ్ ॥ 6 ॥

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళమ్ ॥ 7 ॥

ramachandraya janaka mangalam in telugu

Copy
Give Feedback