Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

నారాయణీయం దశక 100 – భగవతః కేశాదిపాదవర్ణనం

Narayaniyam Dashaka 100 in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

narayaniyam dashaka 100 in telugu

అగ్రే పశ్యామి తేజో నిబిడతరకలాయావలీలోభనీయం
పీయూషాప్లావితోఽహం తదను తదుదరే దివ్యకైశోరవేషమ్ ।
తారుణ్యారంభరమ్యం పరమసుఖరసాస్వాదరోమాంచితాంగై-
రావీతం నారదాద్యైర్విలసదుపనిషత్సుందరీమండలైశ్చ ॥1॥

నీలాభం కుంచితాగ్రం ఘనమమలతరం సంయతం చారుభంగ్యా
రత్నోత్తంసాభిరామం వలయితముదయచ్చంద్రకైః పింఛజాలైః ।
మందారస్రఙ్నివీతం తవ పృథుకబరీభారమాలోకయేఽహం
స్నిగ్ధశ్వేతోర్ధ్వపుండ్రామపి చ సులలితాం ఫాలబాలేందువీథీమ్ ॥2

హృద్యం పూర్ణానుకంపార్ణవమృదులహరీచంచలభ్రూవిలాసై-
రానీలస్నిగ్ధపక్ష్మావలిపరిలసితం నేత్రయుగ్మం విభో తే ।
సాంద్రచ్ఛాయం విశాలారుణకమలదలాకారమాముగ్ధతారం
కారుణ్యాలోకలీలాశిశిరితభువనం క్షిప్యతాం మయ్యనాథే ॥3॥

ఉత్తుంగోల్లాసినాసం హరిమణిముకురప్రోల్లసద్గండపాలీ-
వ్యాలోలత్కర్ణపాశాంచితమకరమణీకుండలద్వంద్వదీప్రమ్ ।
ఉన్మీలద్దంతపంక్తిస్ఫురదరుణతరచ్ఛాయబింబాధరాంతః-
ప్రీతిప్రస్యందిమందస్మితమధురతరం వక్త్రముద్భాసతాం మే ॥4॥

బాహుద్వంద్వేన రత్నోజ్జ్వలవలయభృతా శోణపాణిప్రవాలే-
నోపాత్తాం వేణునాలీ ప్రసృతనఖమయూఖాంగులీసంగశారామ్ ।
కృత్వా వక్త్రారవిందే సుమధురవికసద్రాగముద్భావ్యమానైః
శబ్దబ్రహ్మామృతైస్త్వం శిశిరితభువనైః సించ మే కర్ణవీథీమ్ ॥5॥

ఉత్సర్పత్కౌస్తుభశ్రీతతిభిరరుణితం కోమలం కంఠదేశం
వక్షః శ్రీవత్సరమ్యం తరలతరసముద్దీప్రహారప్రతానమ్ ।
నానావర్ణప్రసూనావలికిసలయినీం వన్యమాలాం విలోల-
ల్లోలంబాం లంబమానామురసి తవ తథా భావయే రత్నమాలామ్ ॥6॥

అంగే పంచాంగరాగైరతిశయవికసత్సౌరభాకృష్టలోకం
లీనానేకత్రిలోకీవితతిమపి కృశాం బిభ్రతం మధ్యవల్లీమ్ ।
శక్రాశ్మన్యస్తతప్తోజ్జ్వలకనకనిభం పీతచేలం దధానం
ధ్యాయామో దీప్తరశ్మిస్ఫుటమణిరశనాకింకిణీమండితం త్వామ్ ॥7॥

ఊరూ చారూ తవోరూ ఘనమసృణరుచౌ చిత్తచోరౌ రమాయాః
విశ్వక్షోభం విశంక్య ధ్రువమనిశముభౌ పీతచేలావృతాంగౌ ।
ఆనమ్రాణాం పురస్తాన్న్యసనధృతసమస్తార్థపాలీసముద్గ-
చ్ఛాయం జానుద్వయం చ క్రమపృథులమనోజ్ఞే చ జంఘే నిషేవే ॥8॥

మంజీరం మంజునాదైరివ పదభజనం శ్రేయ ఇత్యాలపంతం
పాదాగ్రం భ్రాంతిమజ్జత్ప్రణతజనమనోమందరోద్ధారకూర్మమ్ ।
ఉత్తుంగాతామ్రరాజన్నఖరహిమకరజ్యోత్స్నయా చాఽశ్రితానాం
సంతాపధ్వాంతహంత్రీం తతిమనుకలయే మంగలామంగులీనామ్ ॥9॥

యోగీంద్రాణాం త్వదంగేష్వధికసుమధురం ముక్తిభాజాం నివాసో
భక్తానాం కామవర్షద్యుతరుకిసలయం నాథ తే పాదమూలమ్ ।
నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ కారుణ్యసింధో
హృత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానందసందోహలక్ష్మీమ్ ॥10॥

అజ్ఞాత్వా తే మహత్వం యదిహ నిగదితం విశ్వనాథ క్షమేథాః
స్తోత్రం చైతత్సహస్రోత్తరమధికతరం త్వత్ప్రసాదాయ భూయాత్ ।
ద్వేధా నారాయణీయం శ్రుతిషు చ జనుషా స్తుత్యతావర్ణనేన
స్ఫీతం లీలావతారైరిదమిహ కురుతామాయురారోగ్యసౌఖ్యమ్ ॥11॥

narayaniyam dashaka 100 in telugu

Copy
Give Feedback