Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం

Jatiki Oopiri Swatantryam in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

jatiki oopiri swatantryam in telugu

జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యం
ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమ్ ॥

శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,
జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే,
మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయమ్ ॥

ఎప్పటి ఎప్పటి రుచిరస్వప్నం, ఈ స్వాతంత్ర్యం
ఎందరి ఎందరి త్యాగ ఫలం, ఈ స్వాతంత్ర్యం
అందక అందక అందిన ఫలమును అందరికీ అందివ్వండి ॥

స్వరాజ్య సిద్ధికి లక్ష్యమేమిటో స్మరించుకోండి
జాతి విధాత వినూత్న ఫలాలను సాధించండి
సమస్యలన్నీ పరిష్కరించే సౌమ్య మార్గం చూపండి ॥

కలతలు కక్షలు రేపొద్దు ఏ కులం పేరుతో
మారణ హోమం జరపొద్దు ఏ మతం ముసుగులో
సమైక్య భారత సౌధాగ్రం పై, శాంతి దీపం నిలపండి ॥

jatiki oopiri swatantryam in telugu

Copy
Give Feedback