Annamayya Keerthanas Viduva Viduvaninka in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
annamayya keerthanas viduva viduvaninka in telugu
రాగం: సూర్యకాంతం
విడువవిడువనింక విష్ణుడ నీపాదములు
కడగి సంసారవార్థి కడుముంచుకొనిన ॥
పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను ।
ధరణిపై చెలరేగి తనువు వేసరినాను
దురితాలు నలువంక~మ దొడికి తీసినను ॥
పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ ।
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు ॥
యీదేహమే యయిన ఇక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేగినా ।
శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమే చొచ్చితి నేనికను ॥
annamayya keerthanas viduva viduvaninka in telugu
Leave a Comment