Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన తెప్పగా మర్రాకు మీద

Annamayya Keerthanas Teppagaa Maraaku Meeda in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas teppagaa maraaku meeda in telugu

రాగం: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥

చరణం 1
మోతనీటి మడుగులో యీతగరచినవాడు ।
పాతగిలే నూతిక్రింద బాయనివాడు । (2)
మూతిదోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు । (2)
రోతయైన పేగుల పేరులు గలవాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..)

చరణం 2
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు ।
బూడిద బూసినవాని బుద్ధులవాడు । (2)
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు । (2)
దూడల నావులగాచి దొరయైనవాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..)

చరణం 3
ఆకసానబారే వూరి అతివల మానముల ।
కాకుసేయువాడు తురగముపైవాడు । (2)
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి । (2)
యేకాలముబాయని యెనలేనివాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥

annamayya keerthanas teppagaa maraaku meeda in telugu

Copy
Give Feedback