Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి

Annamayya Keerthanas Shodasa Kalanidhiki in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas shodasa kalanidhiki in telugu

రాగం: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాళం:

పల్లవి
షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (2.5)

చరణం 1
అలరు విశ్వాత్మకునను ఆవాహనమిదె
సర్వ నిలయునకు ఆసనము నెమ్మినిదే ।
అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య-అచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ॥
షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.)
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)

చరణం 2
వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణములివే । (2.5)
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ॥ (2.5)
షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.)
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)

చరణం 3
అమృతమథనునకు నదివో నైవేద్యము
రవిజంద్రనేత్రునకు కప్పురవిడెము ।
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ॥
షోడశ కళానిధికి షోడశోపచారములు (ప.)
జాడతోడ నిచ్చలును సమర్పయామి ॥ (ప.) (1.5)

annamayya keerthanas shodasa kalanidhiki in telugu

Copy
Give Feedback