Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము

Annamayya Keerthanas Puttu Bhogulamu Memu in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas puttu bhogulamu memu in telugu

రాగం: మధ్యామావతి/ పాడి
ఆ: స రి1 మ1 ప ని3 స
అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స

పల్లవి
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము ।
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥ (2)

చరణం 1
పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు । (2)
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము (2)
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ॥
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము..(ప..) (2)

చరణం 2
గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు ॥ (2)
భామిని యాకె మగని ప్రాణధారి లెంక- (2)
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ॥
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము..(ప..) (2)

చరణం 3
పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు । (2)
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె (2)
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ॥
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ॥ (2)

annamayya keerthanas puttu bhogulamu memu in telugu

Copy
Give Feedback