Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన పిడికిట తలంబ్రాల

Annamayya Keerthanas Pidikita Talambraala in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas pidikita talambraala in telugu

రాగం: మధ్యామావతి
(పెద తిరు
ఆ: స రి2 మ1 ప ని2 స
అవ: స ని2 ప మ1 రి2 స
తాళం: ఆది

పల్లవి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ।
పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ॥ (2)

చరణం 1
పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద ।
పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు । (2)
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు । (2)
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ॥
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత..(ప..)(2)

చరణం 2
బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు ।
నెర బిరుదు మగని కంటె బెండ్లి కూతురు ।
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ ।
పతి బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ॥
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత..(ప..)

చరణం 3
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు ।
నేడె పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు ।
గట్టిగ వేంకటపతి కౌగిటను ।
పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ॥
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ॥

annamayya keerthanas pidikita talambraala in telugu

Copy
Give Feedback