Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద

Annamayya Keerthanas Muddugaare Yasoda in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas muddugaare yasoda in telugu

రాగం: సారన్గనాట
ఆ: స రి1 మ1 ప ద1 స
అవ: స ని3 స ద1 ప మ1 గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ।
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥ (2)

చరణం 1
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము ।
పంత మాడే కంసుని పాలి వజ్రము ।
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస ।
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..(ప..)

చరణం 1
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము ।
మితి గోవర్ధనపు గోమేధికము ।
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము ।
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ॥
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..(ప..)

చరణం 2
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ।
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము ।
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము ।
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ॥
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..(ప..)

annamayya keerthanas muddugaare yasoda in telugu

Copy
Give Feedback