Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన మేలుకో శ్రుంగారరాయ

Annamayya Keerthanas Meloko Srungaararaaya in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas meloko srungaararaaya in telugu

రాగం: భూపాళ
ఆ: స రి1 గ2 ప ద1 స
అవ: స ద1 ప గ2 రి1 స
తాళం: ఆది

పల్లవి
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల ।
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ॥ (2)

చరణం 1
సందడిచే గోపికల జవ్వనవనములోన ।
కందువందిరిగే మదగజమవు । (2)
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని ।
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ॥ (2)
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల..(ప..)

చరణం 2
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో ।
రతిముద్దు గురిసేటి రాచిలుకా । (2)
సతుల పదారువేల జంట కన్నుల గలువల- ।
కితమై పొడిమిన నా యిందు బింబమ ॥ (2)
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల..(ప..)

చరణం 3
వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై ।
నిరతి వాలిన నా నీలమేఘమా । (2)
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద ।
గరిమ వరాలిచ్చే కల్పతరువా ॥ (2)
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల ।
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ॥

annamayya keerthanas meloko srungaararaaya in telugu

Copy
Give Feedback