Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన మేదిని జీవుల గావ

Annamayya Keerthanas Medini Jeevula Gaava in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas medini jeevula gaava in telugu

రాగం: రేవగుప్తి
ఆ: స రి1 గ3 ప ద1 స
అవ: స ద1 ప గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా ।
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥ (2)

చరణం 1
తగుగోపికల కన్నుదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా ।
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా..(ప..)

చరణం 2
ఘనదురితపు గలువలు వికసించె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా ।
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ॥
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా..(ప..)

చరణం 3
వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషరహిత మేలుకోవయ్యా ।
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ॥
మేదిని జీవుల గావ మేలుకోవయ్యా ।
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥ (2)

annamayya keerthanas medini jeevula gaava in telugu

Copy
Give Feedback