Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన మహినుద్యోగి కావలె

Annamayya Keerthanas Mahinudyogi Kaavale in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas mahinudyogi kaavale in telugu

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు ।
సహజి వలె నుండి ఏమి సాధించలెడు ॥

వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు ।
చెదరి మరచితే సృష్టి చీకటౌ ।
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు ।
నిదురించితే కాలము నిమిషమై తోచు ॥

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ ।
జాడతో నూరకుండితే జడుడౌను ।
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ ।
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ॥

మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు ।
వెరవెరగక ఉండితే వీరిడియౌను ।
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును ।
పరగ సంశయించితే పాషండుడౌను ॥

annamayya keerthanas mahinudyogi kaavale in telugu

Copy
Give Feedback