Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన కులుకుగ నడవరో

Annamayya Keerthanas Kulukuga Nadavaro in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas kulukuga nadavaro in telugu

రాగం: దేసాళం/ అఠాణా,దేశళం
ఆ: స రి2 మ1 ప ని3 స
అవ: స ని3 ద2 ప మ1 ప గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
కులుకక నడవరో కొమ్మలాలా ।
జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥ (2.5)

చరణం 1
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా । (2)
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద (2)
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు ॥ (2)
కులుకక నడవరో కొమ్మలాలా.. (ప..)

చరణం 2
చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల । (2)
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర (2)
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు ॥ (2)
కులుకక నడవరో కొమ్మలాలా.. (ప..) (2)

చరణం 3
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో । (2)
అమరించి కౌగిట నలమేలు మంగనిదె (2)
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు ॥ (2)
కులుకక నడవరో కొమ్మలాలా ।
జలజల రాలీని జాజులు మాయమ్మకు ॥ (2.5)

annamayya keerthanas kulukuga nadavaro in telugu

Copy
Give Feedback