Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన కొలిచిన వారల

Annamayya Keerthanas Kolichina Vaarala in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas kolichina vaarala in telugu

రాగం: వరాళి
ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స
తాళం: ఊన్క్నొవ్న్

పల్లవి
కొలిచిన వారల కొంగుపైడితడు ।
బలిమి తారక బ్రహ్మమీతడు ॥ (2.5)

చరణం 1
ఇనవంశాంబుధి నెగసిన తేజము ।
ఘనయజ్ఞంబుల గల ఫలము । (2)
మనుజరూపమున మనియెడి బ్రహ్మము । (2)
నినువుల రఘుకుల నిధానమీతడు ॥
కొలిచిన వారల కొంగుపైడితడు ..(ప..)

చరణం 2
పరమాన్నములోపలి సారపుజవి ।
పరగినదివిజుల భయహరము । (2)
మరిగినసీతా మంగళసూత్రము । (2)
ధరలో రామావతారంబితడు ॥
కొలిచిన వారల కొంగుపైడితడు ..(ప..)

చరణం 3
చకితదానవుల సంహారచక్రము ।
సకల వనచరుల జయకరము । (2)
వికసితమగు శ్రీవేంకట నిలయము ।
ప్రకటిత దశరథ భాగ్యంబితడు ॥ (2)
కొలిచిన వారల కొంగుపైడితడు ..(ప..)

annamayya keerthanas kolichina vaarala in telugu

Copy
Give Feedback