Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన కొలని దోపరికి

Annamayya Keerthanas Kolani Dopariki in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas kolani dopariki in telugu

రాగం: యదుకుల కాంభోజి
28 హరికాంభోజి జన్య
ఆ: స రి2 మ1 ప ద2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ।
కుల స్వామికిని గొబ్బిళ్ళో ॥ (2)

చరణం 1
కొండ గొడుగుగా గోవుల గాచిన ।
కొండొక శిశువునకు గొబ్బిళ్ళో । (2)
దండగంపు దైత్యుల కెల్లను తల ।
గుండు గండనికి గొబ్బిళ్ళో ॥
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ..(ప..) (2)

చరణం 2
పాప విధుల శిశుపాలుని తిట్టుల ।
కోపగానికిని గొబ్బిళ్ళో । (2)
యేపున కంసుని యిడుమల బెట్టిన ।
గోప బాలునికి గొబ్బిళ్ళో ॥
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ..(ప..) (2)

చరణం 3
దండివైరులను తరిమిన దనుజుల ।
గుండె దిగులునకు గొబ్బిళ్ళో । (2)
వెండిపైడి యగు వేంకట గిరిపై ।
కొండలయ్యకును గొబ్బిళ్ళో ॥
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ..(ప..) (2)

annamayya keerthanas kolani dopariki in telugu

Copy
Give Feedback