Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన కంటి శుక్రవారము

Annamayya Keerthanas Kanti Sukravaaramu in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas kanti sukravaaramu in telugu

రాగం: కురిన్జి
ఆ: స ని3 స రి2 గ3 మ1 ప ద2
అవ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స
తాళం:

పల్లవి
కంటి శుక్రవారము గడియ లేడింట ।
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ (2.5)

చరణం 1
సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి ।
కమ్మని కదంబము కప్పు కన్నీరు । (2)
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి । (2)
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ॥
కంటి శుక్రవారము గడియ లేడింట .. (ప..)

చరణం 2
పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి ।
తెచ్చి శిరసాదిగ దిగనలది । (2)
అచ్చెరపడి చూడనందరి కనులకింపై । (2)
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ॥
కంటి శుక్రవారము గడియ లేడింట .. (ప..)

చరణం 3
తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు ।
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి । (2)
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది । (2)
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ॥
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ (2.5) (ప..)

annamayya keerthanas kanti sukravaaramu in telugu

Copy
Give Feedback