Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన కంటి నఖిలాండ

Annamayya Keerthanas Kanti Nakhilaanda in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas kanti nakhilaanda in telugu

రాగం: మధ్యమావతి,బిలహరి
ఆ: స రి2 మ1 ప ని2 స
అవ: స ని2 ప మ1 రి2 స
రాగం: బిలహరి
ఆ: స రి2 గ3 ప ద2 స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
తాళం:

పల్లవి
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి ।
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ॥ (2)

చరణం 1
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి ।
బహు విభవముల మంటపములు గంటి । (2)
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి ।
రహి వహించిన గోపురములవె కంటి ॥ (2)
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి । (ఫా..)

చరణం 2
పావనంబైన పాపవినాశము గంటి ।
కైవశంబగు గగన గంగ గంటి । (2)
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి ।
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ॥ (2)
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి । (ఫా..)

చరణం 3
పరమ యోగీంద్రులకు భావగోచరమైన ।
సరిలేని పాదాంబుజముల గంటి ।
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి ।
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ॥
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి । (ఫా..)
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ॥

annamayya keerthanas kanti nakhilaanda in telugu

Copy
Give Feedback