Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన జయ జయ రామా

Annamayya Keerthanas Jaya Jaya Raamaa in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas jaya jaya raamaa in telugu

రాగం: నాట
ఆ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ప మ1 రి3 స
తాళం: ఆది

పల్లవి
జయ జయ రామా సమరవిజయ రామా ।
భయహర నిజభక్తపారీణ రామా ॥ (2.5)

చరణం 1
జలధి బంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లు విరచిన సీతారామా । (2)
అలసుగ్రీవునేలి-నాయోధ్యరామా (2)
కలిగి యజ్ఞముగాచే కౌసల్యరామా ॥
జయ జయ రామా సమరవిజయ రామా .. (ప..)

చరణం 2
అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులనుగానే కోదండరామా । (2)
ధర నహల్యపాలిటి దశరథరామా (2)
హరురాణినుతుల లోకాభిరామా ॥
జయ జయ రామా సమరవిజయ రామా ..(ప..)

చరణం 3
అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణరామా । (2)
వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా (2)
మతిలోనబాయని మనువంశరామా ॥
జయ జయ రామా సమరవిజయ రామా ..
భయహర నిజభక్తపారీణ రామా ॥ (2.5)

annamayya keerthanas jaya jaya raamaa in telugu

Copy
Give Feedback