Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు

Annamayya Keerthanas Itti Muddulaadu in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas itti muddulaadu in telugu

రాగం: దేవగాంధారి /ఆనందభైరవి
ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
తాళం: త్/ఏక

పల్లవి
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు
వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ॥ (2)

చరణం 1
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి । (2)
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥ (2)
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ఫా..)

చరణం 2
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి । (2)
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ॥ (2)
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ఫా..)

చరణం 3
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి । (2)
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ॥ (2)
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు
వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ॥ (2) (ఫా..)

annamayya keerthanas itti muddulaadu in telugu

Copy
Give Feedback