Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన ఇప్పుడిటు కలగన్టి

Annamayya Keerthanas Ippuditu Kalaganti in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas ippuditu kalaganti in telugu

రాగం: భూపాళం/ మోహన
ఆ: స రి2 గ3 ప ద2 స
అవ: స ద2 ప గ3 రి2 స
తాళం: ఖండచాపు

పల్లవి
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు ।
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ॥ (2.5)

చరణం 1
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ।
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి । (2)
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి ।
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి ॥
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు .. (ప..)

చరణం 2
కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి ।
ఘనమైన దీపసంఘములు గంటి । (2)
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి ।
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి ॥
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు .. (ప..)

చరణం 3
అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి ।
సరిలేని యభయ హస్తము గంటి ।
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి ।
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి ॥
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు ।
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ॥ (2.5) (ప..)

annamayya keerthanas ippuditu kalaganti in telugu

Copy
Give Feedback