Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన హరి నామము కడు

Annamayya Keerthanas Hari Naamamu Kadu in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas hari naamamu kadu in telugu

రాగం: భైరవి
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
తాళం:

పల్లవి
హరినామము కడు నానందకరము ।
మరుగవో మరుగవో మరుగవో మనసా ॥ (3.5)

చరణం 1
నళినాక్షు శ్రీనామము
కలిదోషహరము కైవల్యము । (2)
ఫలసారము బహుబంధ మోచనము (2)
తలచవో తలచవో మనసా ॥ (2)
హరినామము కడు నానందకరము । (ప..)

చరణం 2
నగధరు నామము నరకహరణము (2)
జగదేకహితము సమ్మతము । (2)
సగుణ నిర్గుణము సాక్షాత్కారము (2)
పొగడవో పొగడవో పొగడవో మనసా ॥ (2)
హరినామము కడు నానందకరము ।(ప..)

చరణం 2
కడగి శ్రీవేంకటపతి నామము (2)
ఒడి ఒడినే సంపత్కరము । (2)
అడియాలం బిల నతి సుఖమూలము (2)
తడవవో తడవవో తడవవో మనసా ॥ (2)
హరినామము కడు నానందకరము ।
మరుగవో మరుగవో మరుగవో మనసా ॥ (ప..)

annamayya keerthanas hari naamamu kadu in telugu

Copy
Give Feedback