Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన గాలినే పోయ

Annamayya Keerthanas Gaaline Poya in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas gaaline poya in telugu

రాగం: గుర్జరితోడి,కన్నడగౌళ
ఆ: స రి2 గ2 మ1 ప ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 స
తాళం:చాపు

పల్లవి
గాలినే పోయ గలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ (2.5)

చరణం 1
అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు
గుడుగుకొననే పట్టె గలకాలము । (2)
ఒడలికి జీవుని కొడయడైనహరి (2)
దడవగా గొంతయు బొద్దులేదు ॥ (2)
గాలినే పోయ గలకాలము (ఫా..)(1.5)

చరణం 2
కలచి చిందనే పట్టె గడవగ నించగ
బట్టె కలుషదేహపుబాధ గలకాలము ।
తలపోసి తనపాలి దైవమైన హరి
దలచగా గొంతయు బొద్దులేదు ।

చరణం 3
శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె
గరిమల గపటాల గలకాలము । (2)
తిరువేంకటగిరి దేవుడైనహరి (2)
దరిచేరా గొంతయు బొద్దులేదు ॥ (2)
గాలినే పోయ గలకాలము
తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ (ప..) (2.5)

annamayya keerthanas gaaline poya in telugu

Copy
Give Feedback