Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన ఏమని పొగడుదుమే

Annamayya Keerthanas Emani Pogadudume in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas emani pogadudume in telugu

రాగం: సామంత / ఆభేరి
ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స
తాళం: ఆదితాళం

పల్లవి
ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మంగ ॥

చరణం 1
తెలికన్నుల నీ తేటలే కదవే ।
వెలయగ విభునికి వెన్నెలలు ।
పులకల మొలకల పొదులివి గదవే ।
పలుమరు పువ్వుల పానుపులు ॥

ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మంగ ॥

చరణం 2
తియ్యపు నీమోవి తేనెలే కదవే ।
వియ్యపు రమణుని విందులివి ।
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె ।
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ॥

ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మంగ ॥

చరణం 3
కైవసమగు నీ కౌగిలే కదవే ।
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు ।
తావు కొన్న మీ తమకములే కదే ।
కావించిన మీ కల్యాణములు ॥

ఏమని పొగదుడుమే యికనిను ।
ఆమని సొబగుల అలమేల్మంగ ॥

annamayya keerthanas emani pogadudume in telugu

Copy
Give Feedback