Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన దాచుకో నీ పాదాలకు

Annamayya Keerthanas Daachuko Nee Paadaalaku in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas daachuko nee paadaalaku in telugu

రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి ।
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ॥

వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ ।
తక్కినవి భాండారాన దాచి వుండనీ ।
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము ।
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ॥

నానాలికపైనుండి నానాసంకీర్తనలు ।
పూని నాచే నిన్ను బొగడించితివి ।
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ ।
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా ॥

యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని ।
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను ।
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ ।
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ॥

annamayya keerthanas daachuko nee paadaalaku in telugu

Copy
Give Feedback