Annamayya Keerthanas Choodaramma Satulaaraa in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.
annamayya keerthanas choodaramma satulaaraa in telugu
చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ ।
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ॥
శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు ।
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు ।
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు ।
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ॥
కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు ।
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు ।
జలజనివాసినియట చల్లదనమేమరుదు ।
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ॥
అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు ।
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు ।
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె ।
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ॥
annamayya keerthanas choodaramma satulaaraa in telugu
Leave a Comment