Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన భావము లోన

Annamayya Keerthanas Bhaavamu Lona in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas bhaavamu lona in telugu

రాగం: దేసాక్షి / సుద్ద ధన్యాసి
22 ఖరహరప్రియ జన్య
ఆ: స గ2 మ1 ప ని2 ప స
అవ: స ని2 ప మ1 గ2 స
తాళం: ఆది

పల్లవి
భావములోనా బాహ్యమునందును ।
గోవింద గోవిందయని కొలువవో మనసా ॥ (2.5)

చరణం 1
హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు । (2)
హరి నామములే అన్ని మంత్రములు (2)
హరి హరి హరి హరి యనవో మనసా ॥ (2)
భావములోనా బాహ్యమునందును ..(ప..) (1.5)

చరణం 2
విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు । (2)
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు (2)
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥ (2)
భావములోనా బాహ్యమునందును ..(ప..) (1.5)

చరణం 3
అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు । (2)
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె (2)
అచ్యుత యచ్యుత శరణనవో మనసా ॥ (2)

భావములోనా బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా ॥

annamayya keerthanas bhaavamu lona in telugu

Copy
Give Feedback