Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన అమ్మమ్మ ఏమమ్మ

Annamayya Keerthanas Ammamma Emamma in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas ammamma emamma in telugu

రాగం: భైరవి
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ ।
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥

చరణం 1
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు । (2)
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ॥ (1.5)
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ ।
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ (ప.) (2)

చరణం 2
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని । (2)
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ॥ (1.5)
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ ।
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ (ప.) (2)

చరణం 3
చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని । (2)
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ॥ (2.5)
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ ।
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ॥ (ప.) (2)

annamayya keerthanas ammamma emamma in telugu

Copy
Give Feedback