Search Results

Search from 23,000+ Stotrams, Mantras & Spiritual Posts

అన్నమయ్య కీర్తన అలర చంచలమైన

Annamayya Keerthanas Alara Chanchalamaina in telugu
with lyrics, PDF, meaning, devotional benefits,
chanting guide and complete spiritual content.

annamayya keerthanas alara chanchalamaina in telugu

రాగం: రాగ మాలికా / నీలాంబరి
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స
అవ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స
తాళం: ఖండ చాపు

పల్లవి
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (1.5)

చరణం 1
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల ।
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ॥ (1.5)

చరణం 2
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల ।
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ॥ (1.5)

చరణం 3
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల ।
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ॥ (1.5)
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (ప.) (1.5)

చరణం 4
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల ।
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ॥

చరణం 5
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల ।
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ॥

చరణం 6
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల ।
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ॥

annamayya keerthanas alara chanchalamaina in telugu

Copy
Give Feedback