Runa Vimochana Ganesha Stotram – telugu

Ganesha Stotras, Stotram Jun 19, 2023

ఋణ విమోచన గణేశ స్తోత్రం

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః |

శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం |

సకల ఋణనాశనే వినియోగః |

శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |ఇతి కర హృదయాది న్యాసః |

ధ్యానంసిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టంబ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

అర్థం – ఎరుపు వర్ణముతో, రెండు భుజములతో, పెద్ద పొట్టతో, కమలపూరేకులలో కూర్చుని,

బ్రహ్మాది దేవతలచే పరిపరివిధముల సేవింపబడుచూ, సిద్ధులచేత నమస్కరింపబడుచున్న గణేశ దేవుని నేను

ధ్యానము చేయుచున్నాను.

స్తోత్రం –

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౧ ||

అర్థం – సృష్టి చేయడానికి ముందుగా బ్రహ్మచే సరిగ్గా పూజచేయబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౨ ||

అర్థం – త్రిపురాసురుని వధించేముందు శంభుదేవునిచే సరిగ్గా పూజచేయబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౩ ||

అర్థం – హిరణ్యకశ్యపులను వధించుట కొరకు విష్ణువుచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౪ ||

అర్థం – మహిషాసురుని వధించునపుడు దేవీ చేత గణనాథ రూపమున గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౫ ||

అర్థం – తారకాసురుని వధించే ముందు కుమారునిచే గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ విశుద్ధయే |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౬ ||

అర్థం – గణేశుడిగా సూర్యునిచే పూజింపబడి, సూర్యుడిని శుద్ధిచేసిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౭ ||

అర్థం – కాంతివృద్ధి కోసం చంద్రునిచే గణనాయకరూపములో పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః |

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౮ ||

అర్థం – తపస్సు రక్షింపబడుట కొరకు విశ్వామిత్రునిచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం |

ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

అర్థం – ఈ ఋణహర స్తోత్రము ఒక సంవత్సరము పాటు రోజూ ఒకసారి చదివితే తీవ్ర దరిద్రమును నశింపజేయగలదు.

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ |

పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

అర్థం – ఎంతటి దారుణమైన దరిద్రములైన తొలగింపబడి కుబేరునితో సమానముగా చేయగలదు. దీని తరువాత పదిహేను అక్షరములుగల మహామంత్రమును పఠించవలెను.

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |

ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

అర్థం – “శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్” అనే మంత్రమును శుచి భావనతో పఠనము చేయవలెను.

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీరితం |

సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

అర్థం – ఇరవైయొక్క సార్లు ఈ మంత్రమును పఠించవలెను. వేయి సార్లు ఆరు నెలలు పఠించినచో ఇష్టమైనవి లభించును.

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ |

అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

అర్థం – పదివేల సార్లు పఠించినచో జ్ఞానములో బృహస్పతి వలె, ధనములో ధనపతి వలె అగును.

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ |

భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

అర్థం – లక్ష సార్లు పఠించినచో సరైన కోరికలకు ఫలితములు వచ్చును. భూతములు,

ప్రేతములు, పిశాచములు మంత్ర స్మరణము చేసిన మాత్రాన నశించును.

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

No Comments

Leave a comment

Love it? Please rate us

Your email address will not be published. Required fields are marked *